చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్
Breaking News
భీమ్ ఆర్మీ టికెట్‌పై అభిజీత్ దిప్కే పోటీ?
Published on Wed, 07/22/2026 - 08:10
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే జోస్యం చెప్పారు. ఆయన భీమ్ ఆర్మీ టికెట్‌పై రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజా ఉద్యమం నుంచి రాజకీయ నాయకులు ఉద్భవిస్తారని, జేపీ ఉద్యమం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, అన్నా హజారే ఉద్యమం నుంచి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన గుర్తుచేశారు.
నీట్-యూజీ పేపర్ లీక్ సహా వివిధ సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు దిప్కే నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ భవన సముదాయంలో దూబే మీడియాతో మాట్లాడుతూ, సీజేపీ ఆందోళనల్లో నినాదాలు చేస్తున్న చాలామంది భీమ్ ఆర్మీతో పాటు గతంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నవారేనని ఆరోపించారు. ఈ నిరసన వెనుక నిర్దిష్ట రాజకీయ అజెండా ఉందని ఆయన విమర్శించారు.
మరోవైపు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ‘చలో సంసద్’ మార్చ్‌పై స్పందిస్తూ ఈ ఉద్యమం పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కోరుకుంటోందని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై దూబే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: గాంధీ నుంచి సోనమ్ వాంగ్‌చుక్ వరకు..
Tags : 1