Breaking News

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్

Published on Mon, 11/04/2024 - 12:03

శ్రీనగర్‌: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత, చరార్-ఎ-షరీఫ్ స్థానం నుండి  ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ రహీమ్ రాథర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ కొత్త అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్‌కు నూతన బాధ్యతలను  అప్పగిస్తూ, అభినందనలు తెలియజేశారు. 80 ఏళ్ల అబ్దుల్ రహీమ్ రాథర్ గతంలో కూడా జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో స్పీకర్ పదవిని నిర్వహించారు. 2002 నుంచి 2008 వరకు పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

సోమవారం జరిగే అసెంబ్లీ తొలి సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకుంటారని అసెంబ్లీ సచివాలయం ఇంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ రైనాను బీజేపీ ఎన్నుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేత బాధ్యతలను సునీల్ శర్మకు అప్పగించారు. అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.   

ఇది కూడా చదవండి: అది ఫేక్‌ సర్వే: తాజా పోల్‌పై మండిపడ్డ ట్రంప్‌ 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)