Breaking News

హస్తినలో ఆప్, బీజేపీ హోరాహోరీ

Published on Sat, 01/25/2025 - 05:12

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. 

ఈసారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్‌ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

ఆప్‌ అంటే ఆపద అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అధికార పార్టీపై ఇప్పటికే యుద్ధ భేరీ మోగించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 53.6 శాతం ఓట్లతో 62 సీట్లు కొల్లగొట్టగా బీజేపీ 39 శాతం ఓట్లతో 8 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్‌ సోదిలో కూడా లేకుండాపోయింది. కేవలం 4.3 శాతం ఓట్లకు పరిమితమైంది. సీట్ల ఖాతాయే తెరవలేక కుదేలైంది.

ద్విముఖమే 
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ద్విముఖ పోరు సాగుతోంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్‌ కూడా మొత్తం 70 సీట్లలోనూ బరిలో ఉన్నా దాని పోటీ నామమాత్రమే. ఆ పార్టీ 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది. ఈసారి బీజేపీ, ఆప్‌లతోపాటు పోటీపడి మరీ హామీలిచ్చినా కాంగ్రెస్‌కు అవి కలిసొచ్చేది అనుమానమే. 

న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఇద్దరు మాజీ సీఎంల కుమారులు బరిలో ఉండటం విశేషం. బీజేపీ నుంచి మాజీ సీఎం సాహిబ్‌సింగ్‌ వర్మ కుమారుడు పర్వేశ్‌ వర్మ, కాంగ్రెస్‌ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కొడుకు సందీప్‌ దీక్షిత్‌ బరిలోకి దిగారు. ఈసారి తమకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని బీజేపీ నేతలంటున్నారు.

 కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు, జనం సొమ్ముతో అద్దాల మేడ కట్టుకోవడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఆప్‌ నేతల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు లాభిస్తాయని అంటున్నారు. ఆప్‌ నేతలు సైతం ఈ ఎన్నికల్లో తమకు విజయం సులభం కాదని అంగీకరిస్తున్నారు. అయితే కేజ్రీవా ల్‌కు జనాదరణ, విశ్వసనీ యత, సంక్షేమ పథకాల సక్రమ అమలు, కొత్త హామీలు గట్టెక్కిస్తాయని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న 
సంగతి తెలిసిందే.

– సాక్షి నేషనల్‌ డెస్క్‌ 
 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)