Breaking News

విదేశాల నుంచి ఆప్‌ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్‌తో భేటీ

Published on Sat, 05/18/2024 - 12:24

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.  ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ సమయంలో రాఘవ్‌ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా  గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. ఆయన బహిరంగ వేదికలపై పార్టీకి మద్దతుగా మాట్లాడేవారు.  కొన్ని నెలల క్రితం ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు బ్రిటన్ వెళ్లారు. ఆ దరిమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.

కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్‌లో చేస్తున్నారని ఆప్‌ నేతలు ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, వారిని బెదిరించారని ఆప్ నేత అతిషి ఆరోపించారు.

#

Tags : 1

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు