Breaking News

‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’.. ఆప్‌ మంత్రి అతిషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

Published on Tue, 05/28/2024 - 17:04

దేశ రాజధాని ఢిల్లీలో మంత్రుల కొనుగోలుకు కుట్ర జరుగుతుందంటూ ఆప్‌ మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 29న తమ ఎదుట హాజరు కావాలని అతిషిని ఆదేశించింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై స్పందనలో భాగంగా కోార్టు ఈ విధంగా  స్పందించింది.

కాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత మంత్రి అతిషి  ఆప్‌ర్టీని,  ప్రభుత్వాన్ని ఢిల్లీలో సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీ ఆరోపణలు గుప్పించారు. ఆప్‌ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు వలగా వేస్తూ వారిని కొనేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండేందుకు పార్టీ మారాలని బీజేపీ తనకు ఆఫర్‌ చేసిందని అతిషి ఆరోపించారు. ‘బీజేపీ సన్నిహితుల ద్వారా నన్ను సంపద్రించింది. వారు నన్ను బీజేపీలో చేరమని అడిగారు. ఇది నా రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఒకవేళ నేను సానకటీ మారకపోతే, నెల రజుల లోపల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నన్ను అరెస్టు చేస్తుందని బెదిరించారు వారు బెదిరించారు’ అని పేర్కొంది.

అతిషితో పాటు, ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ సైతం ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. వీటిని తప్పుడు, నిరాధారమైనవిగాపేర్కొంది. ఒకవేళ  కేజ్రీవాల్‌, అతిషి ఆరోపణలు నిజమైతే వాటికి సాక్షాలు చూపించాలని డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ పోలీసులను ఆశ్రయించగా.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఢిల్లీ పోలాసులు నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. అతిషి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. దీనికి న్యాయస్థానం  స్పందిస్తూ.. అతిషికి నోటీసులు జారీ చేసింది. జూన్‌ 29న మ ఎదుట హాజరు కావాలని తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)