Breaking News

‘ఆప్‌’కు మరో షాక్‌.. హర్యానా అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరిక

Published on Thu, 10/03/2024 - 07:26

చండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. నీలోఖేరి (రిజర్వ్‌డ్) స్థానం నుంచి పోటీలోకి దిగిన ఆప్ అభ్యర్థి అమర్ సింగ్  ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో అమర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా అమర్‌సింగ్‌ను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నట్లు భాజ్వా ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీని ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో  చేరానని పేర్కొన్నారు. నీలోఖేరి కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ గొండర్‌కు మద్దతు ప్రకటించానని, ఆయన తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉందని అన్నారు.

బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడమే తన లక్ష్యమని, తాను తన అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే, ఓట్ల విభజన జరిగి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి ప్రవేశ్ మెహతా సెప్టెంబర్ 28న బీజేపీలో చేరారు. అక్టోబర్ 5న హర్యానాలో ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)