Breaking News

కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్‌.. కేజ్రీవాల్‌ కీలక ప్రకటన

Published on Sun, 12/01/2024 - 14:53

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్‌ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఆప్‌ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

మాజీ సీఎం కేజ్రీవాల్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తు ఉండదు. ఇండియా కూటమితో పొత్తుకు మేము సిద్ధంగా లేమంటూ కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నేను చేసిన తప్పు ఏంటి..? ఢిల్లీ శాంతిభద్రతల విషయంలో కేంద్రమంత్రి అమిత్‌ షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే.. గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, కేజ్రీవాల్‌పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అంటూ ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్‌ ప్రకారమే కేజ్రీవాల్‌పై దాడి జరిగిందని వారు మండిపడుతున్నారు. కాగా, ఆప్‌ ఆరోపణలను బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ స్పందిస్తూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అని చెప్పుకొచ్చారు. ప్రజలు సింపథీ కోసమే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ ప్రకటనతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, ఇండియా కూటమి నేతలు, బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)