Breaking News

ఆప్‌ పార్టీకి, మంత్రి పదవికి కైలాష్‌ గెహ్లాట్ రాజీనామా

Published on Sun, 11/17/2024 - 13:21

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు విమర్శలు చేస్తూ, ఒక ప్రకటిన విడుదల చేశారు.

కైలాష్ ఆ ప​‍కటనలో  పార్టీలో పలు వింత వివాదాల ఉన్నాయని, అవి  అందరినీ పలు సందేహాలకు గురిచేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఆప్ నుండి విడిపోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని, అందుకే తాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.

కేంద్రంతో పోరాడడం వల్ల సమయం వృధా అని కైలాష్  అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతోందని, కేజ్రీవాల్ తన కోసం విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయామన్నారు. యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని, అది నేడు అత్యంత కలుషితంగా మారిందన్నారు. ఢిల్లీలో ని సామాన్యులు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. 
 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కైలాష్ గెహ్లాట్‌ను ఈడీ విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడైన విజయ్ నాయర్ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారిక నివాసంలో నివసించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. కాగా కైలాష్ గెహ్లాట్ రాజీనామా తర్వాత బీజేపీ నేత కపిల్ మిశ్రా ఒక ప్రకటన చేశారు. మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా లేఖతో పలు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని గెహ్లాట్‌ తన రాజీనామా లేఖలో స్పష్టంగా రాశారన్నారు.  కైలాష్ గెహ్లాట్ తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినదని కపిల్‌ మిశ్రా అన్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)