Breaking News

100 రోజుల తర్వాత అంత్యక్రియలు

Published on Thu, 06/18/2026 - 12:36

సాక్షి, చెన్నై: పోలీసుల విచారణలో మరణించిన ఆకాష్‌ అనే యువకుడి మతదేహానికి  100 రోజుల తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు బుధవారం జరిగాయి.  మదురై ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుండి ఆకాష్‌ మతదేహాన్ని స్మశాన వాటికకు తరలిస్తున్న సమయంలో పోలీసులకు, అతడి బంధువులకు మధ్య తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో ఘర్షణకు దిగిన బంధువులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.  

మార్చురీకే పరిమితం  
శివగంగై జిల్లా మానామదురైకి చెందిన ఆకాష్‌ డెలిసన్‌ (24) అనే యువకుడిని, స్థానికంగా ఇద్దరిపై దాడి చేసిన కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత పోలీసుల కొట్టడం వల్లే  ఆకాష్‌ కాలు ఎముక విరిగిందని పేర్కొంటూ అతడిని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, చికిత్స పొందుతూ మార్చి 8వ తేదీన ఆకాష్‌ ప్రాణాలు కోల్పోయాడు. హైకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లోనే అతడి మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కొట్టి చంపేశారంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో మత దేహం మార్చురీకి పరిమితమైంద.

100 రోజులుగా  నిరసన 
ఈ ఘటనపై హత్య కేసు నమోదైనప్పటికీ, బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్ట్‌ చేయాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆకాష్‌ బంధువులు పలు విడతలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చారు.అప్పటి వరకు మత దేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.  

కోర్టు ఆదేశంతో రంగంలోకి ప్రభుత్వం 
వంద రోజులకు పైగా మార్చురికి పరిమితమైన ఆకాష్‌ మతదేహానికి ప్రభుత్వమే అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలు నిర్వహించాలని మద్రాసు  హైకోర్టు మదురై బెంచ్‌ తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం, జిల్లా రెవెన్యూ అధికారి అన్బళగన్‌ నేతత్వంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆకాష్‌ మతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆసుపత్రి వెలుపలికి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఆకాష్‌ బంధువులు మతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. 

ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు  
పరస్పరం వాగ్వాదం,  తీవ్ర తోపులాట నడుమ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అతడి బంధువులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆకాష్‌ కుటుంబీకుల  సమక్షంలోనే మదురైలోని తత్తనేరి విద్యుత్‌ శ్మశానవాటికలో మతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.  
 

#

Tags : 1

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)