Breaking News

ఇక పోలీస్‌ వద్ద ‘ఆధార్‌’

Published on Fri, 11/08/2024 - 08:12

సాక్షి, అమరావతి: ఆధార్‌ డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. నేర పరిశోధన ప్రక్రియలో పోలీసులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు  ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వేలిముద్రలకు సంబంధించిన డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఆధార్‌ డేటాను పర్యవేక్షించే ‘యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)ను ఇప్పటికే ఆదేశించింది. 

యూఐడీఏఐ చట్ట ప్రకారం ఆధార్‌ డేటా అత్యంత గోప్యంగా ఉంచాలి. ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కీలక డేటా కావడంతో ఈ మేరకు కఠిన నిబంధనలను రూపొందించింది. ఆధార్‌ డేటాలోని ప్రాథమికమైన వేలి ముద్రలు, ఐరీష్‌ స్కాన్‌లను ఇతరులకు అందుబాటులోకి తేకూడదని ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 29 (1) స్పష్టం చేస్తోంది. కాగా హైకోర్టు అనుమతితో కొంత పరిమిత డేటాను పోలీసులు పొందేందుకు సెక్షన్‌ 33 (1) అవకాశం కల్పిస్తోంది. 

దాంతో నిర్దిష్టమైన కేసుల దర్యాప్తు కోసం పోలీసులు హైకోర్టు అనుమతితో ఆధార్‌ డేటాను పరిశీలిస్తున్నారు. కానీ నేర పరిశోధన తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ప్రధానంగా గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వలస కూలీలు, నిరుపేదలకు ఎలాంటి పత్రాలు ఉండడం లేదు. అందుకే ఆధార్‌ డేటాను తమకు అందుబాటులోకి తేవాలని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలు కేంద్ర హోం శాఖను కోరుతున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ డేటాను అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకోసం అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలని భావిస్తోంది.  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)