Breaking News

Supreme Court Of India: వయసు నిర్ధారణకు ‘ఆధార్‌’ ప్రామాణికం కాదు

Published on Fri, 10/25/2024 - 03:50

న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిమిత్తం రోడ్డు ప్రమాద మృతుడి వయసును నిర్ధారించడానికి ఆధార్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్‌ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌–2015 టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని తెలిపింది.

 ‘ఆధార్‌ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా  2023లో సర్క్యులర్‌ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. 2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ రూ. 19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

 మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్‌– హరియా ణా హైకోర్టు ఆధార్‌ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు తగ్గించింది. దీన్ని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా వయసు నిర్ధారణకు ఆధార్‌ కార్డును ప్రామా ణికంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)