Breaking News

లాంగ్వేజ్‌ పరీక్షకు 104 మంది హాజరు.. 99 మంది ఫెయిల్‌!

Published on Sat, 03/23/2024 - 06:56

ఉత్తరాఖండ్‌లోని ఒక కాలేజీ విద్యార్థులు అందరినీ ఆశ్చర్యపరిచే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయం తెలిసినవారంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల పండిట్‌ శివరామ్‌ ప్రభుత్వ కళాశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. 

ఈ కళాశాలలో బీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలో 92 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 104 మంది విద్యార్థులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే హిందీ పేపర్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపధ్యంలో జవాబు పత్రాలను మరోమారు మూల్యాంకనం చేయాలని  విద్యార్థి సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ ఫలితాలతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

ఇటీవల ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో 129 మంది విద్యార్థుల్లో 119 మంది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 104 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే హిందీలో ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థుల్లో 61 మంది విద్యార్థులు పొలిటికల్ సైన్స్‌లో ఫెయిల్ అయ్యారు. హిస్టరీలో 56 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లీషులో 28 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

సోషియాలజీలో 39 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రమేష్‌ రావత్‌ మాట్లాడుతూ ఈ విషయమై ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, జవాబు పత్రాలను మరోమారు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అంజనా శ్రీవాస్తవ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాల పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)