Breaking News

‘నడుములు విరుగుతున్నాయ్‌!’.. ఇక్కడ 90శాతం గుంతలు..2శాతమే రోడ్లు

Published on Mon, 10/20/2025 - 13:24

సాక్షి,బెంగళూరు: భారత్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరు నగర రోడ్ల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 90శాతం గుంతలు,రెండు శాతం రోడ్లంటూ నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

తాజాగా,నగరంలోని వర్తుర్-గుంజూర్ ప్రాంతంలో గుంతల మయమైన రోడ్ల గురించి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు నగర వాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు,ఆవేదనతో కూడిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

ఇక ఆ ఫొటోను పోస్టు చేసిన సదరు ప్రాంత నివాసి.. సాధారణంగా..రోడ్డు పరిమాణం 98 శాతం..గుంతల పరిమాణం 2 శాతం ఉంటుంది. అక్టోబర్ 17న బెంగళూరులో తీసిన ఈ ఫోటోలో రోడ్డు కేవలం 2 శాతం మాత్రమే.. గుంతల రోడ్లు 98 శాతం ఉంది.మనం వర్తూర్-గుంజూర్‌ను గుంతలు లేనిదిగా చేయగలమా? అంటూ గ్రేటర్‌ బెంగళూరు అథారిటీ కమిషనర్‌కు ట్యాగ్‌ చేశారు.  

ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు మా వెన్నెముకలు విరుగుతున్నాయి. పన్ను చెల్లించే ప్రజల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు?’అంటూ ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరో నెటిజన్‌ ‘నేషనల్ అక్వాటిక్ హైవే’ కార్లు బోట్లుగా మారుతున్నాయి.హెల్మెట్లు లైఫ్ జాకెట్లుగా... గూగుల్ మ్యాప్స్ చెబుతోంది‘500 మీటర్లు ఈదుతూ ముందుకు సాగండి’ అని. ఇలా రోడ్లు లేక్‌లుగా మారితే..కార్లు కాదు... బోట్లే అవసరం!’అంటూ చమత్కరిస్తున్నారు.

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)