Breaking News

Rajasthan: వికటించిన మధ్యాహ్న భోజనం.. 90 మంది విద్యార్థులకు అస్వస్థత

Published on Sun, 09/14/2025 - 09:52

దౌసా: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన 90 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు. చుడియావాస్ గ్రామంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పాఠశాలలోని 156 మంది విద్యార్థులు రాష్ట్ర పోషకాహార పథకం కింద అందించిన చపాతీ, కూర తిన్నారు. తరువాత వారిలో 90 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న  వైద్య బృందం పాఠశాలకు తరలివచ్చింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో వారిని నంగల్ రాజ్‌వతన్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారిలోని 49 మంది విద్యార్థులను దౌసా జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. వారికి వైద్యసేవలు అందించేందుకు అదనంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించారు. సాయంత్రం నాటికి పిల్లలందరూ కోలుకున్నారని  వైద్యశాఖ అధికారులు ధృవీకరించారు.

అంతకుముందు ఆస్పత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్.. విద్యార్థులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పాఠశాలలో వడ్డించిన  ఆహార నమూనాలను సేకరించారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రి కిరోరి లాల్ మీనా, బీజేపీ నేత జగ్మోహన్ మీనా జిల్లా ఆస్పత్రిని సందర్శించి, విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన మరోసారి ప్రభుత్వ మధ్యాహ్న భోజనం నాణ్యతపై అనుమానాలను లేవనెత్తింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)