Breaking News

8AM TO 8PM Shift.. భగ్గుమంటున్న అధ్యాపకులు, విద్యార్థులు‌

Published on Sat, 08/02/2025 - 11:18

న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాలు నూతన విద్యా సంవత్సరంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో, ఢిల్లీ విశ్వవిద్యాలయం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థాగత ప్రాధాన్యతలు, విద్యావేత్తల పని పరిస్థితులపై సాగుతున్న చర్చలను మరింత తీవ్రతరం చేసింది. అలాగే ఈ నిర్ణయం నిర్మాణాత్మక మార్పుల అమలుకు దోహదపడుతుందని, క్యాంపస్‌లలో విద్యావాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని బోధనా సంఘం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

ఢిల్లీ విశ్వవిద్యాలయం తన తాజా ఉత్తర్వులలో వర్శిటీ పరిధిలోని అన్ని కళాశాలలు,అనుబంధ సంస్థలు సాధారణ పని దినాలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య పనిచేయాలని అధికారికంగా  ఆదేశించింది. జూలై 31న జారీ చేసిన ఈ ఆదేశంలో.. వనరులను ఉత్తమంగా ఉపయోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే పని గంటలను పెంచాలనే ఈ ఆదేశం వర్శిటీలోని అన్ని విభాగాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. జూలై 12న జరిగిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్శిటీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పొడిగించిన ఈ పని గంటలను సమర్థవంతంగా ఉపయోగిచుకునేందుకు అధ్యాపకులు, సిబ్బంది ముందుకు రావాలని విశ్వవిద్యాలయం సూచించింది. కొత్త విద్యా సంవత్సరానికి ముందు నుంచే ఈ విధానం అమలుకానుంది.  మరోవైపు ఈ నూతన విద్యాసంవత్సరం(2025-26) నుంచే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) ప్రారంభం కానుంది. సీనియర్ రెగ్యులర్ ఫ్యాకల్టీకి నాల్గవ  ఏడాది విద్యార్థులకు బోధనా బాధ్యతలు అప్పగించనున్నట్లు తాజా నోటిఫికేషన్‌లో వర్శిటీ పేర్కొంది.

ఢిల్లీ విశ్వవిద్యాలయం జారీ చేసిన ఆదేశంపై అధ్యాపకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఉత్తర్వులను అసాధ్యమని, బోధనా సిబ్బందికి,  విద్యార్థులకు హానికరం అని అధ్యాపకులు అంటున్నారు. అలాగే ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని పలువురు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కళాశాలలకు దూరంగా ఉన్న అధ్యాపకులకు, విద్యార్థులకు ఇది సమస్యగా మారనున్నదనే వాదన వినిపిస్తోంది. 

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)