Breaking News

Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్‌ఫోన్‌.. స్పందించిన కంపెనీ

Published on Thu, 04/27/2023 - 18:56

మొబైల్‌లో వీడియో చూస్తూ చిన్నారి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షావోమీ సంస్థ ఘటనపై స్పందించింది. బాధిత కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని త్రిసూర్‌లో ఎనిమిదేళ్ల ఆదిత్యశ్రీ స్మార్ట్‌ఫోన్‌లో వీడియో చూస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఘటనపై స్థానిక పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. అన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఘటనకు కారణమైన మొబైల్‌ ఫోన్‌ మోడల్‌ రెడ్‌ మీ అని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు.
(చదవండి: చేతిలో స్మార్ట్‌ఫోన్‌..వెన్నెముక డౌన్‌!)

ఫోన్‌ పేలిన ఘటనపై రెడ్‌ మీ మొబైల్స్‌ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్‌ మీ మొబైల్‌ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు.
(స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు)

కాగా, మొబైల్‌ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్‌కు చార్జింగ్‌ పెడుతుండగా షాక్‌ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదువాలో జరిగింది. మరో ఘటనలో 68 ఏళ్ల పెద్దాయన, చార్జ్‌ అవుతున్న మొబైల్‌లో మాట్లాతుండగా షాక్‌ కొట్టింది. ఆయన స్పాట్‌లో విగతజీవిగా మారాడు. ఇలాంటివే మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిలో ముఖ్యంగా గమనించిన అంశాలేంటంటే.. ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగా వాడటం.

నిపుణుల సూచనలివే..!
► మొబైల్‌ చార్జింగ్‌ అవుతుండగా వాడరాదు
► చార్జ్‌ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్‌ వేడెక్కుతుంది
► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది
► ఫోన్‌ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది
► బ్యాటరీ లైఫ్‌టైం తగ్గిపోయే అవకాశం ఉంది
► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది
► చార్జింగ్‌ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు
► తడి చేతులతో చార్జింగ్‌ పెట్టరాదు.. ఫోన్‌ వాడరాదు
► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్‌ పెడితే షాక్‌ కొట్టే చాన్స్‌ ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)