Breaking News

రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ

Published on Mon, 12/22/2025 - 17:25

పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమర్ సింగ్ చాహల్ సోమవారం సెక్యూరిటీ గార్డు రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారు. సంఘటనా స్థలం నుండి  12  పేజీల సూసైడ్‌ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ తెలియజేశారు. పంజాబ్‌లోని పాటియాలాలో చాహల్‌ ఆత్మహత్యాయత్నం విషయం తమ దృష్టికి రాగానే పోలీసు బృందాలు అతని నివాసానికి చేరుకుని, ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ప్రకటించారు.  ప్రస్తుతం చాహెల్‌  పరిస్థితి విషమంగా ఉందని,  ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.

సూసైడ్ నోట్ లో ఏముంది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు, అందులో చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని రాసి ఉంది.  ఈ మేరకు చాహల్ పంజాబ్ పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్‌లో రూ.8.10 కోట్ల విలువైన ఆన్‌లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ మోసం, తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్టు సూసైడ్ నోట్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చాహల్ ఐజీ పదవి నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి పాటియాలాలో నివసిస్తున్నారు.

కోట్కాపుర కాల్పుల కేసులో  నిందితుడు
కాగా  2015లో ఫరీద్‌కోట్‌లో జరిగిన బెహ్బాల్ కలాన్ ,కోట్కాపుర కాల్పుల కేసు నిందితుల్లో అమర్ సింగ్ చాహల్ కూడా ఒకరు. 2023, ఫిబ్రవరిలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్.కె. యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అమర్ సింగ్ చాహల్‌తో సహా పలువురు సీనియర్ పంజాబ్ అధికారులపై ఫరీద్‌కోట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.

కాగా గతంలో కూడా సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని సీనియర్ పోలీసు అధికారి వై. పురాన్ కుమార్ చండీగఢ్‌లోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు డీజీపీ, ఏడీజీసీ ఎస్పీతో సహా 10 మంది అధికారులను నిందిస్తూ ఆయన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాసిన సంగతి తెలిసిందే.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)