Breaking News

బ్యాంకు ఖాతాలు.. ఇంతింతై!

Published on Tue, 10/28/2025 - 01:16

ప్రపంచవ్యాప్తంగా 100 మంది మహిళల్లో 77 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మన దేశం మాత్రం ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే చాలా మెరుగ్గా ఉంది. ప్రపంచ బ్యాంకు ఫైండెక్స్‌ రిపోర్ట్‌–2025, సీఎంఎస్‌–టెలికం రిపోర్ట్‌–2025 ప్రకారం భారత్‌లో ఏకంగా 89% మంది మహిళలు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుండడం విశేషం. ఆర్థిక కార్యకలాపాల్లోనూ అత్యధిక మహిళలు నిమగ్నమయ్యారనడానికి ఇది నిదర్శనం. ఆర్థిక విషయాలపట్ల పెరుగుతున్న అవగాహన, జన్  ధన్  ఖాతాలు, ప్రభుత్వ పథకాల తాలూకా ఆర్థిక ప్రయోజనాలు నేరుగా ఖాతాల్లోకి చేరడం.. వెరసి బ్యాంకు సేవలు అందుకుంటున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా 2025 ఆగస్టు నాటికి 56 కోట్లకుపైగా ప్రధాన మంత్రి జన్  ధన్  యోజన ఖాతాలు తెరిచారు. వీటిలో 55.7 శాతం ఖాతాలు మహిళలకు చెందినవి కావడం విశేషం. ప్రపంచ బ్యాంక్‌ గ్లోబల్‌ ఫైండెక్స్‌ డేటాబేస్‌ 2025 ప్రకారం 54% భారతీయ మహిళలు తమ మొదటి బ్యాంకు ఖాతాను ప్రధానంగా ప్రభుత్వ ప్రయోజనాలు లేదా వేతనాలను పొందడానికి తెరిచారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా 89% మంది భారతీయ మహిళలు బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం గమనార్హం.

తగినంత నగదు లేక..
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా అందుకున్న నగదుపై మహిళల నియంత్రణ పెరిగిందని నివేదిక తెలిపింది. స్త్రీ పేరుతో ఉన్న ఆదాయం.. గృహ నిర్ణయాలలో ఆమె వాటాను పెంచుతుందని.. కుటంబ అభివృద్ధికి దోహదపడుతుందని పరిశోధనలో తేలింది. బ్యాంకు ఖాతాల విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఖాతాల్లో తగినంత నగదు లేకపోవడం, తక్కువ అవసరం, అధికారిక బ్యాంకింగ్‌లో పాల్గొనడంలో అసౌకర్యం కారణంగా 17.5 శాతం బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవు.

మరొకరిపై ఆధారం..
డేటా ఖర్చులు, గోప్యత లేకపోవడం, సైబర్‌ మోసం భయం, సామాజిక నిబంధనల వంటివి మహిళలు మొబైల్‌ ఫోన్లు కొనకుండా అడ్డుకుంటున్నాయని నివేదిక తెలిపింది. సొంతంగా మొబైల్‌ లేకపోవడం స్వతంత్ర డిజిటల్‌ బ్యాంకింగ్‌ను పరిమితం చేస్తోంది. భారతీయ మహిళల్లో 66 శాతానికిపైగా ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు చేయడానికి పురుష బంధువులపై ఆధారపడుతున్నారట. ప్రభుత్వ పథకాలు ఆర్థిక సాధికారతకు నిజమైన సాధనంగా మారాలంటే.. మహిళల బ్యాంకు ఖాతాలలో డబ్బును జమ చేయడమేకాదు, లబ్ధిదారులకు దీర్ఘకాలిక మద్దతు అవసరమని నివేదిక వివరించింది. సబ్సిడీ స్మార్ట్‌ఫోన్లు, సరసమైన డేటా ప్లాన్లు.. మహిళలు తమ ఖాతాలను, డిజిటల్‌ చెల్లింపు సాధనాలను స్వతంత్రంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తాయి.

బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం (శాతాల్లో)
⇒ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు - 89
⇒ డెబిట్‌ కార్డుదారులు - 30
⇒ నగదు పంపడం, విత్‌డ్రా - 25
⇒ ఖాతాలో పొదుపు  - 21.2
⇒ డిజిటల్‌ చెల్లింపులకు కార్డు/మొబైల్‌ వాడకం - 18.9
⇒ క్రియాశీలకంగా లేని ఖాతాలు - 17.5
⇒ రుణం తీసుకున్నవారు  - 11.9
⇒ వ్యాపారానికి రుణం  - 9
⇒ యుటిలిటీ బిల్లులు చెల్లించినవారు -  8.4
⇒ డిజిటల్‌ పేమెంట్స్‌ చేసినవారు - 7.8

మహిళలకు అందుబాటులో మొబైల్‌.. ఆర్థిక లావాదేవీలలో దాని వినియోగం (శాతాల్లో)
⇒ ఖాతా నిల్వ పరిశీలనకు మొబైల్, ఇంటర్‌నెట్‌ వాడినవారు - 27
⇒ పురుషుల సాయం లేకుండా లావాదేవీ నిర్వహించినవారు  - 28
⇒ కుటుంబ సభ్యులకు తన ఫోన్  ఇచ్చేవారు  - 31
⇒ తన పేరుతో సిమ్‌ ఉన్నవారు - 32
⇒ ఇతరుల ఫోన్  వాడడం వల్ల సొంతంగా మొబైల్‌ లేనివారు - 24
⇒ భద్రతా కారణాలతో సొంతంగా ఫోన్  లేనివారు - 18
⇒ చదవడం, టైపింగ్‌ రాకపోవడం వల్ల ఫోన్  లేనివారు  - 27
⇒ డబ్బులు లేక మొబైల్‌ కొనుక్కోలేనివారు - 32
⇒ టెలికం సేవలు ఖరీదు కావడం వల్ల ఫోన్  కొనలేనివారు - 38

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)