Breaking News

76 ఏళ్ల వయసులో జిప్‌లైన్‌పై రయ్యి! 

Published on Sat, 07/25/2026 - 00:56

మళప్పురం: బామ్మ వయసు 76 ఏళ్లే కానీ... మనసు మాత్రం పదహారుకు మించదు. అందుకేనేమో... కొడుకు, కోడళ్లు.. మనుమలు, మనుమరాండ్రు అందరితో విహారయాత్రకు వెళ్లి... జిప్‌లైన్‌ సవారీ చేస్తానని పట్టుపట్టింది. కుటుంబ సభ్యులు వద్దని వారించినా... ప్రమాదమని హెచ్చరించినా అస్సలు పట్టించుకోలేదు. ‘‘అదేంటో (జిప్‌లైన్‌ సవారీ) నాకు తెలియదు. కానీ చూడగానే సవారీ చేయాలని అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ పడవలో తిరుగుతూండగా చూశా జిప్‌లైన్‌ను. అక్కడి వెళ్లా. అక్కడున్న వ్యక్తి ఏం ఫర్వాలేదు. నేను తీసుకెళతా. భయపడొద్దు అన్నాడు. సరే అని సవారీ మొదలుపెట్టా. భయమేమీ కాలేదు. 

సగం దూరం వెళ్లిన తరువాత... నా చేయి వదిలేయమని ఆ వ్యక్తికి చెప్పాను. నేనే స్వయంగా తాడు పట్టుకుని సవారీ మొత్తం పూర్తి చేశా’’అని బోసినవ్వుతో తన అనుభవాన్ని వెల్లడించింది. సవారీ మొత్తం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందంటూనే... ఎప్పుడు ఇలాంటి సాహసాలు ఎదురపడ్డా వదిలేది లేదని ధీమాగా చెప్పింది. ఊరూ.. పేరు చెప్పనే లేదు కదూ... బామ్మది కేరళలోని మళప్పురం వద్ద ఉన్న తనూర్‌. పేరు లక్ష్మి. పొన్నాని నదిపై జిప్‌లైన్‌పై బామ్మ సవారీ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌!  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి