Breaking News

‘ప్రాణం పోసుకున్న’ పెద్దాయన!

Published on Sat, 11/08/2025 - 06:26

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఒక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయాడనుకున్న 70 ఏళ్ల పెద్దాయన అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే ఊహించని అద్భుతం జరిగింది. పెద్దాయన తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. 

ఆశలన్నీ వదిలేసుకున్నాక.. 
‘నవంబర్‌ 1న మా తండ్రి మఖన్‌ లాల్‌ వైద్య్‌కు బ్రెయిన్‌ హెమరేజ్‌ కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చాం. మా నాన్నకు ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కానీ కొంత సమయం తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచారు’.. అని వృద్ధుని కొడుకు సంజయ్‌ వైద్య్‌ వివరించారు. ఎన్నాళ్లయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో, ఆయన్ను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. గురువారం ఆస్పత్రిలో లైఫ్‌ సపోర్ట్‌ తీసేసిన తర్వాత, వృద్ధుని శ్వాస ఆగిపోయి, చనిపోయారని కుటుంబం భావించింది. 

ఇంటికి తెచ్చిన అర్ధగంటలో.. 
‘నేను మా నాన్నగారి మరణ వార్తను, అంత్యక్రియల వివరాలతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టాం, మా బంధువులు, పరిచయస్తులు ఇంటికి రావడం ప్రారంభించారు’.. అని సంజయ్‌ వివరించారు. అయితే.. ఆయనను ఇంటికి తీసుకువచ్చిన అర్ధగంటలోనే పెద్దాయన మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించారు!. ఈ సంఘటనను అద్భుతంగా అభివరి్ణంచిన సంజయ్‌ వైద్య్, తన తండ్రి ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారని చెప్పారు. ‘మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’.. అని చెప్పిన వైద్య్, తన తండ్రి క్షేమంగా ఉన్నారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)