Breaking News

ఏడు రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు

Published on Wed, 07/10/2024 - 12:47

ముంబై: మహానగరం ముంబైలోని ఏడు లోకల్ స్టేషన్ల పేర్లు త్వరలో మారనున్నాయి. ముంబైలోని మెరైన్ లైన్స్ స్టేషన్‌ను ఇకముందు ముంబా దేవి స్టేషన్‌గా పిలవనున్నారు. ఈ స్టేషన్ పేరును మార్చడం వల్ల ముంబా దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది.

ముంబైలోని ఏడు స్థానిక రైల్వే స్టేషన్ల పేర్లను మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. మెరైన్ లైన్‌ను ముంబా దేవిగా, కర్రీ రోడ్డును లాల్‌బాగ్‌గా, సాండ్‌హర్స్ట్ రోడ్డును డోంగ్రీగా, చర్ని రోడ్డును గిర్గావ్‌ స్టేషన్‌గా మార్చనున్నారు. అలాగే కాటన్ గ్రీన్ స్టేషన్‌కు కాలాచౌకీ అని, డాక్‌యార్డ్ రోడ్డును మజ్‌గావ్‌గా, కింగ్ సర్కిల్‌ను తీర్థంకర్ పార్శ్వనాథ్‌ స్టేషన్‌గా మార్చనున్నారు.

ఈ ప్రతిపాదనను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్ సమర్పించారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. దీనికి అనుమతి లభించిన వెంటనే ఈ స్టేషన్ల పేర్లను మార్చనున్నారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు