Breaking News

యూపీలో మళ్లీ కరోనా కలకలం

Published on Sun, 02/25/2024 - 11:32

ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో  ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్‌నగర్, వసుంధర, వైశాలి,  సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్‌లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ,  కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్‌కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు.

2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్‌ల టీకాలు అందించారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)