Breaking News

కనిపించని ఏసీ కోచ్‌.. కంగుతిన్న ‘రిజర్వేషన్‌’ ప్రయాణికులు.. తరువాత?

Published on Sun, 01/05/2025 - 10:20

శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం సర్వసాధారణం. అలాగే ఈ సీజన్‌లో రైళ్లలో సాంకేతిక సమస్యలు తతెత్తుతుంటాయి. దీనికి  భిన్నమైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనిగురించి తెలుసుకున్నవారంతా అవాక్కవుతున్నారు.

రాజస్థాన్‌లోని  జైపూర్ రైల్వే జంక్షన్‌(Jaipur Railway Junction)లో విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జైపూర్- జైసల్మేర్ మధ్య నడుస్తున్న లీలన్ ఎక్స్‌ప్రెస్ (12468)లో వెళ్లేందుకు వచ్చిన 64 మంది ప్రయాణికులు ఆ సమయంలో గందరగోళానికి గురయ్యారు. వారంతా ఏసీ కోచ్‌లో సీటుకోసం రిజర్వేషన్‌ చేయించుకున్నారు. అయితే రైలులో తమ కోచ్‌ కనిపించకపోవడంతా వారంతా అవాక్కయ్యారు.  

వారు ఎదురు చూసిన రైలులో బీఈ-1 (థర్డ్ ఏసీ) కోచ్‌ను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. ఇంతలో ఒక ప్రయాణికుడి దృష్టి నాన్ ఏసీ కోచ్‌పై పడింది. దానిపై బీఈ-1/ఎస్‌ఎల్ అని రాసి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి అది స్లీపర్ కోచ్, ఏసీ కోచ్ కాదు. దీంతో ఆ 36 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనను చూసిన రైల్వే అధికారులు(Railway officials) ఆ కోచ్‌ దగ్గరకు చేరుకున్నారు. వారు ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రయాణికులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ రైలులో థర్డ్‌ ఏసీ కోచ్‌ సౌకర్యం ఉండదని, స్లీపర్‌ కోచ్‌లోనే ప్రయాణించాలని వారు తెలియజేశారు. అలాంటప్పుడు థర్డ్‌ ఏసీ టికెట్లు ఎందుకు జారీ చేశారని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.

వాస్తవానికి నెల్లాళ్ల క్రితమే ఈ రైలునుంచి ఏసీ కోచ్‌ను తొలగించారు. అయితే దీనిని టిక్కెట్లు జారే చేసే కంప్యూటర్‌ సిస్టమ్‌ నుంచి తొలగించలేదు. దీంతో టిక్కెట్లు జారీ అయ్యాయి. గత డిసెంబర్‌లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, థర్డ్ ఏసీ క్లాస్‌తో కూడిన తాత్కాలిక కోచ్‌ను ఈ రైలుకు ఏర్పాటు చేశారు. అయితే దీనిని జనవరి ఒకటి తర్వాత తొలగించారు. సిస్టమ్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో, ఈ కోచ్‌లో 64 మంది ప్రయాణికుల బుకింగ్‌ జరిగింది. తరువాత ఈ పొరపాటును అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో అధికారు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. అయితే ఏసీబోగీలో ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వారు అదనంగా చెల్లించిన సొమ్మును వాపసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్‌కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్‌’

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)