Breaking News

Mumbai: 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు

Published on Wed, 06/19/2024 - 07:23

మహారాష్ట్రలోని ముంబైలో గల బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు  బెదిరింపు ఈ మెయిల్స్‌ పంపారు. ఈ నేపధ్యంలో బీఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బీఎంసీ కార్యాలయంతో పాటు బాంబు బెదిరింపులు అందిన అన్ని ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.

వీపీఎన్ నెట్‌వర్క్ ద్వారా ఈ బెదిరింపు ఈమెయిల్స్‌ పంపినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం, జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.  

గతంలో దేశంలోని 41 విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. 'కేఎన్‌ఆర్‌’ అనే ఆన్‌లైన్ గ్రూప్ ఈ నకిలీ బెదిరింపు ఈ మెయిల్స్‌ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బృందం మే ఒకటిన ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్‌ పంపినట్లు పోలీసులు గుర్తించారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)