Breaking News

163కు చేరిన జీబీఎస్‌ కేసులు.. వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు

Published on Tue, 02/04/2025 - 11:31

పూణె: మహారాష్ట్రలోని పూణెను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. తాజాగా మరో ఐదుగురు అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో మహారాష్ట్రలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్‌) అనుమానిత కేసుల సంఖ్య 163కి  చేరింది. ఆరోగ్య శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందారని తెలిపారు.

కొత్తగా జీబీఎస్‌(Guillain-Barré syndrome) కారణంగా ఎవరూ మరణించనప్పటికీ సోమవారం కొత్తగా మరో ఐదు కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి తెలిపారు. మొత్తం 127 మంది  జీబీఎస్‌తో బాధపడుతున్నట్లు తేలిందని ఆయన తెలిపారు. పూణె నగరంలో 32, పూణె మునిసిపల్ కార్పొరేషన్‌కు కొత్తగా అనుసంధానించిన గ్రామాల నుండి 86, పింప్రి చించ్వాడ్‌లో 18, పూణె గ్రామీణ ప్రాంతంలో 19, ఇతర జిల్లాల్లో ఎనిమిది సహా 163 అనుమానిత కేసులు ఉన్నాయన్నారు. 163 మంది రోగులలో  47 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని 47 మంది  ఐసియులో చికిత్స పొందుతున్నారని, 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారని ఆ అధికారి వివరించారు.

పూణె నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 168 నీటి నమూనాలను(Water samples) రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రజారోగ్య ప్రయోగశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. దీనిలో ఎనిమిది నీటి వనరులు కలుషితమైనట్లు తేలిందని ఆయన అన్నారు. జీబీఎస్‌ అనేది ఒక అరుదైన రుగ్మత. ఇది సోకినప్పుడు శరీరంలోని వివిధ అవయవాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. చేతులు, కాళ్లలో తీవ్రమైన బలహీనత ఏర్పడుతుంది. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా జీబీఎస్‌ వ్యాప్తికి కారణమని నిపుణులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎన్‌కౌంటర్‌లో ట్విస్ట్‌.. కంగుతిన్న పోలీసులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)