Breaking News

ప్రాణం తీసిన ఫుట్‌బోర్డు ప్రయాణం

Published on Mon, 06/09/2025 - 10:18

ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం జరిగిన ప్రమాదంలో జీఆర్పీ కానిస్టేబుల్‌ సహా నలుగురు రైలు ప్రయాణికులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. ఉదయంపూట కిక్కిరిసిన రైళ్లలో నిర్లక్ష్యంగా ప్రయాణించడమే ఇందుకు కారణం. ముంబ్రా రైల్వే స్టేషన్‌సమీపంలో ఈ ఘటన జరిగింది. రెండు రైళ్లలో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. వీపులకు భారీ బ్యాగులు తగిలించుకొని డోర్ల వద్ద ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. 

వీటిలో ఒక రైలు కాసారా వైపు, మరొకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ వైపు వెళ్తోంది. ఈ రెండు రైళ్లు పక్కపక్కనున్న పట్టాలపై పరస్పరం వ్యతిరేక దిశలో వచ్చిన సమయంలో మూలమలుపు వద్ద ప్రయాణికుల బ్యాగులు పరస్పరం ఢీకొన్నాయి. దాంతో మొత్తం 13 మంది వెంటనే కిందపడిపోయారు. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడి మృతి చెందారని రైల్వే అధికారులు ప్రకటించారు. బాధితులను కేతన్‌ సరోజ్, రాహుల్‌ గుప్తా, మయూర్‌ షా, జీఆర్పీ కానిస్టేబుల్‌ విక్కీ ముఖ్యాద్‌గా గుర్తించారు.

 రైళ్లకు అటోమేటిక్‌ డోర్లు లేకపోవడం ప్రాణాంతకంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ఆటోమేటిక్‌ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు అధికారి దిలీప్‌ కుమార్‌ చెప్పారు. ప్రయాణికులు లోపలికి వెళ్లగానే డోర్లు వాటంతట ఆవే మూసుకుపోయేలా రైలు బోగీలను డిజైన్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ముబ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రైల్వే శాఖను కోరనట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.  
 

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)