Breaking News

రోడ్డు ప్రమాదాల్లో 1.97 లక్షల మంది బలి

Published on Thu, 10/02/2025 - 06:32

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రహదారులు రక్త సిక్తమవుతున్నాయి. ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు ఒడి కి చేరుతున్నారు. 2023 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్‌ ప్రమాదా ల్లో ఏకంగా 1,97,871 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ‘యాసిడెంటల్‌ డెత్స్‌–సూసైడ్స్‌ ఇన్‌ ఇండియా 2023’పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022తో పోలిస్తే 2023లో మొత్తం ట్రాఫిక్‌ ప్రమాదాల సంఖ్య 4,72,467 నుంచి 4,91,190కి పెరిగింది. ఈ ప్రమాదాల్లో 4,51,228 మంది గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాలే అధికం
మొత్తం ట్రాఫిక్‌ ప్రమాదాల్లో అత్యధికం రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. 2023లో 4,64,029 రోడ్డు ప్రమాదాలు జరగగా, వీటిలో 1,73,826 మంది మరణించారు. వీటితో పాటు 24,678 రైల్వే ప్రమాదాల్లో 21,803 మంది, 2,483 రైల్వే క్రాసింగ్‌ ప్రమాదాల్లో 2,242 మంది చనిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే, ట్రాఫిక్‌ ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్‌ (28,103), తమిళనాడు (20,279), మహారాష్ట్ర (18,879) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 

ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం ట్రాఫిక్‌ మరణాలలో 34% వాటాను కలిగి ఉన్నాయి. 2023లో తెలంగాణలో మొత్తం 23,673 ట్రాఫిక్‌ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల కారణంగా 8,435 మంది మరణించారు. వీటిలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, వీటిలో 7,660 మంది మృత్యువాత పడ్డారు.

అతివేగమే యమపాశం
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 61.4% అంటే 2,84,733 కేసులు అతివేగం వల్లనే జరిగాయి. రోడ్డు ప్రమాద మరణాల్లో 58.6% అంటే, 1,01,841 మంది అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన/నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ లేదా ఓవర్‌ టేకింగ్‌ కారణంగా 23.7% ప్రమాదాలు, 1,10,064 కేసుల్లో, 41,035 మంది, అంటే 23.6% మరణించారు. మద్యం/డ్రగ్స్‌ సేవించి వాహనాలు నడపడం వల్ల 3,688 మంది మృత్యువాత పడ్డారు.

ద్విచక్ర వాహనదారులే ఎక్కువ
ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహ నదారులే అత్యధికంగా ఉన్నారు. మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 45.8% అంటే 79,533 మంది వీరివే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత పాదచారులు 15.9%, 27,586 మంది, కారు/జీపు/ఎస్‌ యూవీ ప్రయాణికులు 14.3%, 24,776 మంది ఉన్నారు.

జాతీయ రహదారులపైనే ఎక్కువ
దేశంలోని మొత్తం రోడ్ల పొడవులో జాతీయ రహదారుల వాటా కేవలం 2.1% మాత్రమే అయినప్పటికీ, అత్యధిక ప్రమాదాలు, మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 30.3% జాతీయ రహదారులపైనే జరిగాయి. అదేవిధంగా, మొత్తం మరణాలలో 34.6% అంటే 60,127 ఈ రహదారులపైనే నమోదయ్యాయి. దీని తర్వాత రాష్ట్ర రహదారులపై 23.4% మరణాలు అంటే 40,611 సంభవించాయి. ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలు రహదారి భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి.

ప్రమాదాల ముఖచిత్రం        (2023)
మొత్తం ట్రాఫిక్‌ ప్రమాదాలు    4,91,190
మొత్తం మరణాలు               1,97,871
రోడ్డు ప్రమాద మరణాలు       1,73,826
అతివేగంతో మరణాలు          1,01,841
ద్విచక్ర వాహనదారుల మరణాలు    79,533

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)