Breaking News

యూపీలో ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లు

Published on Wed, 09/17/2025 - 05:16

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల జాబితాలో భారీ మొత్తంలో అవకతవకలు చోటుచేసుకు న్నాయని ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ మంగళవారం ఆరోపించారు. మహోబా జిల్లాలోని ఒకే ఒక ఇంటి నంబర్‌తో 4,271 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. లక్నోలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహోబా జిల్లాలోని రెండు ఇళ్లలో 243, 185 ఉన్నట్లు కనుగొని షాకయ్యా.

తాజాగా, ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లున్నారు. అంటే ఆ కుటుంబంలోని మొత్తం సభ్యులు కనీసం 12 వేల మంది ఉండి ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే గ్రామంలో మొత్తం ఓటర్లు సుమారు 16 వేలు కావడం మరింత తీవ్రమైన అంశమన్నారు. బీజేపీ, ఎన్నికల కమిషన్‌ కలిసి యూపీలో ఓట్ల చోరీ మొదలుపెట్టాయన్నారు. అదేవిధంగా, బిహార్‌లో బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా సంజయ్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలోని భాగల్పూర్‌లో పారిశ్రా మికవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌కు ఎకరా కేవలం రూ.1కే ఏకంగా వెయ్యి ఎకరాల భూమిని పవర్‌ ప్లాంట్‌ కోసం 25 ఏళ్లకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. ఈప్లాంట్‌ విద్యుత్‌ను యూనిట్‌ రూ.7 చొప్పున 25 ఏళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)