Breaking News

ఓటు వేశారు.. డైమండ్‌ రింగ్‌ గెలుచుకున్నారు!

Published on Wed, 05/08/2024 - 12:05

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్‌ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ‍ప్రత్యేక బహుమతులను అందించారు.

భోపాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.

లోక్‌సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్‌ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్  నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్‌ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)