Breaking News

Maharashtra: ‘పలుమార్లు ఎస్‌ఐ అఘాయిత్యం’.. వైద్యురాలి సూసైడ్‌ నోట్‌లో ‘దారుణాలు’

Published on Sat, 10/25/2025 - 13:52

ఫల్టన్: మహారాష్ట్రలోని ఫల్టన్‌కు చెందిన మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందుకు ఆమె రాసిన లేఖ  అందరినీ కదిలింపజేస్తోంది. తనపై ఎస్సై గోపాల్ బాద్నే నాలుగుసార్లు అత్యాచారం చేశాడని మృతురాలు లేఖలో పేర్కొంది.  

నాలుగు పేజీల సూసైడ్‌ లేఖలో..
మహారాష్ట్రలో చోటుచేసుకున్న యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయేముందు ఆమె తన అరచేతిపై సూసైడ్ లేఖ రాసుకున్నారు. అలాగే అంతకుముందు రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ బయటపడటంతో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆ లేఖలో ఆమె తనపై ఎస్‌ఐ గోపాల్ బాద్నే ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు.

ఎంపీతోపాటు అతని పీఏల ప్రమేయం?
అలాగే ఆ లేఖలో ఆమె ఓ ఎంపీతోపాటు అతని పీఏలపై కూడా  తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. పోలీసు కేసుల్లోని పలువురు నిందితులకు నకిలీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులతో పాటు ఒక ఎంపీ, అతని సహాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వైద్యురాలు ఆరోపించారు. అందుకే తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యురాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బాద్నే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. 5 నెలలకు పైగా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆ లేఖలో  వివరించారు. ఇక దీనిపై ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు.  

పోలీసు అధికారి సస్పెండ్
బాధిత వైద్యురాలు గత 23 నెలలుగా ఇదే ఆస్పత్రిలో  సేవలు అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆమె భావించారు. అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా వైద్యురాలు ఆ లేఖలో తన ఇంటి యజమాని ప్రశాంత్ బంకర్‌పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. ఎస్సై గోపాల్ బాద్నే, ఇంటి యజమాని బంకర్‌పై కేసు నమోదు చేశారు. ఎస్సై గోపాల్ బాద్నేను సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని  ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కొల్హాపూర్ డివిజన్) సునీల్ ఫులారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

పోలీసులను కాపాడుతున్న ‘మహాయతి’: కాంగ్రెస్‌
ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతలంతా  పోలీసులను కాపాడుతున్నారని ఆరోపించింది.‘రక్షకుడే వేటగానిగా మారినప్పుడు.. న్యాయం ఎలా జరుగుతుంది? బాధిత వైద్యురాలు  గతంలో ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహాయుతి ప్రభుత్వం పోలీసులను కాపాడుతోంది. ఫలితంగా పోలీసుల దురాగతాలు పెరుగుతున్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడేట్టివార్ ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు.

‘క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం’
‘ఈ సంఘటన దురదృష్టకరం, నేను సతారా పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడాను. వైద్యురాలు ఫిర్యాదు చేశారని, అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం.  మహిళలు ఇటువంటి ఫిర్యాదులను నమోదు చేయడానికి 112 హెల్ప్‌లైన్‌ను ఉపయోగించాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బీజేపీ మహిళా నేత చిత్ర వాఘ్ పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)