Breaking News

గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..

Published on Sun, 04/13/2025 - 13:29

న్యూఢిల్లీ: ఈ రోజు(ఆదివారం, ఏప్రిల్‌ 13) ఉదయం ఒక గంట వ్యవధిలో భారతదేశం, మయన్మార్(Myanmar), తజికిస్తాన్‌లలో నాలుగు భూకంపాలు సంభవించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో సంభవించగా, ఆ తర్వాత మయన్మార్‌లోని మీక్టిలాలో, అనంతరం భారతదేశంలోని జమ్మూ కశ్మీర్‌లోగల కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో  భూకంపాలు నమోదయ్యాయి. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.

తజికిస్తాన్‌(Tajikistan)లో భూకంప తీవ్రత 6.0గా నమోదయ్యింది. దేశంలోని ఫైజాబాద్ సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఉదయం 9:00 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  ఒక గంటలో సంభవించిన నాలుగు భూకంపాలలో ఇది మొదటిది. మయన్మార్‌లో భూకంపం 5.5 తీవ్రతతో వచ్చింది. మీక్టిలా సమీపంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2025, మార్చి 28న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ఈరోజు తిరిగి బలమైన భూకంపం సంభవించింది. జనం ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లోని హిమాలయన్‌ ‍ప్రాంతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి నష్టం  జరగలేదు.  ఇదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నాలుగు భూకంపాలు ఒక గంట వ్యవధిలో చోటుచేసుకున్నాయి. ఈ భూకంపాలు భారత ఫలకం యురేషియన్ ఫలకంతో ఢీకొనడం  కారణంగా సంభవించే టెక్టోనిక్ కదలికల ఫలితంగా  చోటుచేసుకుంటున్నాయి. మయన్మార్‌లో 2025, మార్చి 28న సంభవించిన భూకంపంలో 3,600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు.

ఇది కూడా చదవండి: Jallianwala Bagh Anniversary: దేశ చరిత్రలో ఘోర అధ్యాయం: ప్రధాని మోదీ

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)