Breaking News

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

Published on Sun, 11/30/2025 - 17:47

దంతెవాడ: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ రీజియన్‌ దంతెవాడ జిల్లాలో ఇవాళ (ఆదివారం, నవంబర్‌ 30) 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ అమలు చేస్తున్న ‘పూనా మర్గం’ ప్రచారానికి ఆకర్షితులై వారు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులు హింసను విడిచిపెట్టి  జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని దంతేవాడ పోలీసులు పిలుపునిచ్చారు. 

తాము హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న మావోయిస్టులు.. దంతెవాడలోని డీఆర్‌జీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో వారు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

2024-25లో జరిగిన ఆపరేషన్లు, ఎదురుకాల్పులు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్రయోజనాలతో మావోయిస్టులను హింసను విడిచిపెట్టేలా చేశాయని ఎస్పీ రాయ్‌ తెలిపారు. గత 20 నెలల్లో దంతేవాడలో 508 మంది మావోయిస్టులు, అందులో 165 మంది లొంగిపోయారని రాయ్ చెప్పారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)