Breaking News

యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి

Published on Sun, 06/16/2024 - 13:49

ఉత్తరప్రదేశ్‌లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్‌లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్‌లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్‌, బుందేల్‌ఖండ్‌లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.

వీరిలో కాన్పూర్‌లో ఎనిమిది మంది, చిత్రకూట్‌లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్‌లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్‌భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)