Breaking News

గుండెపోటుతో బ్యాంక్‌లోనే కుప్పకూలిన ఉద్యోగి.. సీసీటీవీ దృశ్యాలు వైర‌ల్‌

Published on Wed, 06/26/2024 - 18:53

ఇటీవ‌ల గుండెపోటు మ‌ర‌ణాలు ఎక్కువ‌వుతున్నాయి. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కు స‌డెన్ హార్ట్ ఎటాక్‌లు  ఆందోళన క‌లిగిస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మ‌ర‌ణాలు యువ‌త‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువ‌కుడు ఆక‌స్మిక గుండెపోటుతో మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో వెలుగుచూసింది.

మ‌హోబాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 30 ఏళ్ల అగి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ రాజేష్ కుమార్ త‌న ల్యాప్ టాప్‌లో ప‌నిచేస్తూ ఉన్నాడు. అక‌స్మాత్తుగా త‌న కుర్చీపై కుప్ప‌కూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. 

వారు అత‌ని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్ర‌య‌త్నం చేశారు. యువ‌కుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం య‌త్నించారు. కానీ ఫ‌లితం లేక‌పోవ‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. అయితే యువ‌కుడు బ్యాంక్‌లో కుప్ప‌కూలిన వీడియో అక్క‌డి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ‌య్యింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)