Breaking News

పాక్షికంగా ప్రభావం చూపిన సమ్మె 

Published on Fri, 02/13/2026 - 01:33

న్యూఢిల్లీ: కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మికసంఘాలు గురువారం సమ్మె చేపట్టాయి.  కార్మికులు, రైతులు, పలు రంగాల శ్రామికు లు కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారని కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే సమ్మె ప్రభా వం దేశవ్యాప్తంగా పాక్షికంగానే కన్పించింది. 

దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజా రవాణా, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ కార్యకలాపాలు యతాథతంగా కొనసాగాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వేలాది మంది కార్మికుల భారీ నిరసన ప్రదర్శనలతో జనజీవనం కాస్తంత స్తంభించింది. ఒడిశా, కేరళ, తమిళనాడు, గోవా, జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం అత్యధికంగా కన్పించింది. చాలా రాష్టాల్లో కార్మిక సంఘాలు ఆయా పని ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల ప్రధాన ద్వారాల వద్ద ధర్నాకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. 

అత్యంత వివాదాస్పద నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని కార్మికసంఘాలు డిమాండ్‌చేశాయి. ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్‌ సవరణ బిల్లు, సస్టేనబుల్‌ హార్నెసింగ్, అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్‌ఫార్మింగ్‌ ఇండియా(శాంతి) చట్టాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌చేశాయి. వీబీ జీ రాంజీ చట్టాన్ని పక్కనబెట్టి వెంటనే పాత ఎంజీనరేగా చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని కోరాయి. సమ్మె కు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు తమ కార్యాలయాలు, కర్మాగారాలకు ఆలస్యంగా హాజరయ్యారు.

 దేశవ్యాప్తంగా 600కుపైగా జిల్లాల్లో సమ్మె విజయవంతమైందని కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లతోపాటు సంయుక్త కిసాన్‌ మోర్చాలు, వ్యవసాయ కార్మికుల సంఘాల సంయుక్త వేదిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎస్‌ ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీ సంఘాలు ఈ సంయుక్త ఫో రమ్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. ఢిల్లీ లో అన్ని పారిశ్రామిక వాడల నుంచి పలు కార్మిక సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. 

జంతర్‌మంతర్‌ వద్ద సమావేశం నిర్వహించి కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక ముఖ్యనేతలు తూర్పారబట్టారు. తమ రాష్ట్రంలో బ్యాంకింగ్, బీ మా, బొగ్గు రంగంలో కార్యకలాపాలు పూర్తి గా స్తంభించిపోయాయని జార్ఖండ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీఓఐ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర డెప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఉమేశ్‌ దాస్‌ ప్రకటించారు. కేరళలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ప్రైవేట్‌ బస్సులూ రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో మాత్రం జనజీవనానికి ఎలాంటా ఆటంకం కలగలేదు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)