Breaking News

700 అడుగుల లోతు బోరు బావిలో చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

Published on Tue, 12/24/2024 - 15:18

జైపూర్‌: రెండు వారాల వ్యవధిలో రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి చేతన బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది 20 గంటలుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతులో ఉన్న పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి.  ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి.  

పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాజస్థాన్ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చేతన తన తండ్రితో కలిసి పోలానికి వెళ్లింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా.. చేతన పొలంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవ శాత్తూ పొలంలో ఏర్పాటు చేసిన 700 అడుగుల బోరుబావిలో పడింది. దీంతో భయాందోళన గురైన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు చేతనను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. చేతన 150 అడుగుల లోతులోకి జారినట్లు గుర్తించారు. బోరుబావి లోపల పాప ఆచూకీ కోసం కెమెరాలను పంపించారు. 20 గంటలకు బోరుబావిలో ఉన్న చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. బోరుబావి లోపల ఉన్న చేతనను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. 

విఫలమైన ప్రయత్నం.. చివరిగా 
150 అడుగుల లోతులో ఉన్న చేతనకు ఆక్సిజన్‌ పైపును లోపలికి పంపారు. బోరుబావికి ఓ వైపు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ  వ్యవసాయం క్షేత్రం కావడంతో మట్టి తేమగా ఉంది. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం, పొడవైన రాడ్‌కు బిగించిన హుక్‌ సాయంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతన సురక్షితంగా బోరుబావి నుంచి బయట పడుతుందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఆర్యన్‌  
కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌ దౌస జిల్లాలోని కలిఖడ్ గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ఆర్యన్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్యన్‌ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడ్డాడు. బాలుడి కోసం రెస్క్యూ బృందాలు సుమారు 57 గంటల పాటు శ్రమించాయి. చివరికి 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)