Breaking News

ఢిల్లీలోని మూడు మాల్స్‌, ఓ ఆసుపత్రికి బాంబు బెదిరింపు

Published on Tue, 08/20/2024 - 16:16

దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. పాఠశాలలు, షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థన స్థలాలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ప్రముఖుల ఇళ్లే టార్గెట్‌గా వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలోని మూడు మాల్స్‌కు, ఓ ఆసుపత్రికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

చాణక్యపురిలోని చాణక్య మాల్‌, సాకేత్‌ ప్రాంతంలోని సెలెక్ట్‌ సిటీవాక్‌, వసంత్‌ కుంజ్‌లోని ఆంబియెన్స్‌ మాల్‌ సహా చాణక్యపురిలోని ప్రైమస్‌ ఆసుపత్రికి ఈ మెయిల్‌ ద్వారా బాబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని గంటల్లో బాంబు పేలుతుందంటూ దుండగులు మెయిల్‌లో పేర్కొన్నట్లు చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఆయా మాల్స్‌, ఆసుపత్రి వద్దకు చేరుకొని సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. చివరకు ఆ బెదిరింపు బూటకమని తేలింది

కాగా ఈ నెల 17న గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్‌ మాల్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు మాల్‌ మేనేజ్‌మెంట్‌కు మెయిల్‌ ద్వారా బెదిరించారు. ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్‌లో బాంబులు అమర్చాం. మీలో ఎవ్వరూ తప్పించుకోలేరు,  అందరూ చస్తారు’ అంటూ అందులో పేర్కొన్నారు. 

దీంతో అప్రమత్తమైన మాల్‌ అధికారులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మాల్‌ను ఖాళీ చేయించారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి బాంబూ దొరకలేదని గురుగ్రామ్‌ పోలీసులు తెలిపారు. ఇక 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?