Breaking News

ఐఏఎస్‌ కల చెదిరింది

Published on Thu, 07/10/2025 - 10:15

కర్ణాటక: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. తమ ఆప్తులు కళ్లముందే తిరిగి రాని లోకాలకు వెళ్తుంటే కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 24 గంటల్లో పలు జిల్లాలలో 7 మంది వరకూ హఠాన్మరణం పాలయ్యారు. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా చందనకేరాలో మెహసిన్‌ ఒశా పటేల్‌ (22) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం  కుప్పకూలాడు. ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఇతనికి గత నెల 15న పెళ్లయింది. ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబీకులు విలపించారు. కాగా, కలబురగి జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల నుంచి గుండెసమస్యలతో 40 మంది వరకు చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో 15 మంది 45 ఏళ్ల లోపువారు.  

సివిల్స్‌ కలలు భగ్నం
హుబ్లీ: సివిల్స్‌ పరీక్షల్లో పాస్‌ కావాలి, ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ కావాలనేది ఆమె కల. కానీ మాయదారి గుండెపోటు ఆ కలల్ని ఛిద్రం చేసింది. బుధవారం ధార్వాడ పురోహిత నగరలో జీవిత కుసగూర (26) అనే విద్యావంతురాలు ఆకస్మికంగా మరణించింది. ఉదయం ఇంట్లో ఉండగా తల తిప్పినట్లుగా ఉందని చెబుతూ కూర్చుండిపోయింది. కుటుంబసభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే శ్వాస వదిలింది. ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గుండెపోటుతో మరణించిందని ప్రకటించారు. ఎంఎస్‌సీ అగ్రిక  ల్చర్‌ చదువుతున్న జీవిత యూపీఎస్‌ఈ పరీక్షలు రాసి ఐఏఎస్‌ అధికారి కావాలని కలలు కంది. ఈమె తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. బిడ్డ చిరుప్రాయంలోనే మృత్యువాత పడటంతో కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. 

పారిశ్రామికవేత్త కొడుకు..  
దావణగెరె  నగరంలోని జయనగరలో పారిశ్రామికవేత్త రేఖా ముర్గేశ్‌ కొడుకు అక్షయ్‌ (22) ఇంటిలో గుండెపోటుతో కిందపడి మరణించాడు. ఇతడు కాలేజీలో చదివేవాడు. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిసింది.  

బెళగావిలో రైతు..  
బెళగావి జిల్లా సవదత్తి పట్టణంలోని ఎపిఎంసీలో వాహన డ్రైవర్‌ అశోక్‌ జీరిగవాడ (40) కుప్పకూలి మృతి చెందారు. రైతు అయిన అశోక్‌ తన పొలంలో పెసర్లను అమ్మడానికి వచ్చి ప్రాణాలు విడిచాడు.  

కనకపురలో అటవీ ఉద్యోగి  
కనకపుర తాలూకా కోగ్గె దొడ్డి గ్రామానికి చెందిన మాదేశ్‌ నాయక్‌ (30) ఫారెస్ట్‌ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎద నొప్పి వచ్చి కింద పడి మృతి చెందారు.  

తరగతిలో బాలుడు..  
చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబగెరి గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న మనోజ్‌కుమార్‌ (9) అనే బాలుడు తరగతిలోనే కన్ను­మూ­శాడు. పాఠం వింటూ కుప్పకూలాడు. మనోజ్‌ ఇప్పటికే గుండెలో రంధ్రం పడి చికిత్స పొందుతున్నాడు.  

అవుల కాపరి..   
బెంగళూరు దక్షిణ జిల్లా గోల్లరదొడ్డికి చెందిన పశువుల కాపరి గిరీశ్‌ (25) గుండెపోటుకు బలయ్యాడు. గత మూడు రోజుల నుంచి గిరీశ్‌ ఎద నొప్పి అని కుటుంబీకులకు చెప్పేవాడు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)