Breaking News

2023లో జనం‍ సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!

Published on Sun, 12/24/2023 - 07:44

2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్‌లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అధిక కొలెస్ట్రాల్ 
ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి.

2. మధుమేహం
మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది.

3. అధిక యూరిక్ యాసిడ్ 
అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

4. హై బీపీకి హోం రెమెడీ
అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం  గూగుల్‌లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్‌ విధానాలను ప్రయత్నించవచ్చు.

5. ఊబకాయం
ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది. 
ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు?

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు