Breaking News

కలుషిత ఆహారం.. 200 మంది విద్యార్థులు అనారోగ్యంపాలు!

Published on Sat, 03/09/2024 - 11:35

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గల ఒక హాస్టల్‌లో కలుషిత ఆహారం తిన్న సుమారు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు.  

ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్యన్ రెసిడెన్సీ అండ్‌ లాయిడ్స్ హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం తిన్న కారణంగా అనారోగ్యం పాలయ్యారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా హాస్టల్‌లో తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

హాస్టల్ నిర్వాహకునిపై బాధిత విద్యార్థులు పోలీసుల ఎదుట తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 8వ తేదీ సాయంత్రం హాస్టల్‌లో ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని నాలెడ్జ్ పార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే బాధిత విద్యార్థులందరినీ సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)