26నుంచి భారీ వర్షాలు
Breaking News
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
బైక్‌ను లారీ ఢీ.. డ్యాన్సర్లు మృతి
Published on Tue, 06/17/2025 - 06:58
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): నృత్య వేడుకలో ప్రదర్శన ఇచ్చి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు యువ డాన్సర్లకు అదే చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన నెలమంగల కుణిగల్ బైపాస్‌లో సోమవారం వేకువన జరిగింది.
బెంగళూరు శ్రీరాంపుర కు చెందిన ప్రజ్వల్ (22), సహన (21) ఇద్దరూ సినిమాల్లో డాన్సర్లుగా నటించడంతో పాటు వేడుకలలో పాల్గొని ప్రదర్శనలిచ్చేవారు. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో స్నేహంగా ఉండేవారు. ఆదివారంనాడు కుణిగల్‌లో జరిగిన ఈవెంట్లో పాల్గొని తెల్లవారుజామున బైక్‌పై తిరిగి వస్తున్నారు. వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలై ఇద్దరూ అక్కడే మరణించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
#
Tags : 1