Breaking News

వింత వివాహం.. వీళ్లకు పెళ్లేంటి? అంటూ పురోహితుడు పరార్‌

Published on Wed, 06/26/2024 - 11:25

హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన వింత పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశంగామారింది. ఇద్దరు యువతులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ, పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో ఇతర వివాహాలలో మాదిరిగానే అన్ని వ్యవహారాలు జరిగాయి.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ వివాహ వేడుక హల్దీ వేడుకతో మొదలై అప్పగింతలతో  ముగిసింది. కవితా టప్పు, అంజు శర్మలు వధూవరులుగా మారి  దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వధువు వేషధారణలో  ఉన్న కవిత, వరుడి వేషధారణలో ఉన్న అంజు శర్మ వేదికపై కుర్చీలలో కూర్చుని అతిథుల ఆశీర్వాదాలు అందుకున్నారు.

భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ వీరి వివాహానికి ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు. ఈ వివాహానికి కవిత, అంజుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే  పెళ్లి జరిపించాల్సిన పురోహితునికి తాను ఇద్దరు యువతులకు పెళ్లి చేయాల్సి ఉందని తెలియానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వారి బంధువులలో ఒకరు ఆ పురోహితుడిని ఒప్పించి వివాహ వేడుక సవ్యంగా జరిగేలా చూశారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)