Breaking News

భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం!

Published on Thu, 03/21/2024 - 09:19

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్‌లో బుధవారం అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు.

ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు.  మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో ఎవరూ నివసించడంలేదు. గ్రౌండ్ ఫ్లోర్‌లో జీన్స్‌ కటింగ్‌ పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వీరిలోని ఇద్దరు జీటీబీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఒక కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవనం యజమాని షాహిద్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాహిద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)