Breaking News

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు

Published on Sun, 08/11/2024 - 04:49

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు నేలకొరగ్గా మరో నలుగురు జవాన్లు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కొకెర్‌నాగ్‌ ప్రాంతం అహ్లాన్‌ గగర్‌మండులో 10 వేలఅడుగుల ఎత్తులోని అటవీప్రాంతంలో కార్డన్‌ సెర్ఛ్‌ చేపట్టాయి. 

తనిఖీలు జరుపుతున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారన్నారు. తప్పించుకుపోయిన ఉగ్రమూకల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. 

నలుగురు ఉగ్రవాదుల స్కెచ్‌ విడుదల 
జూలై 8వ తేదీన కథువా జిల్లాలోని మచెడిలో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. స్థానికులు ఇచి్చన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను రూపొందించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. అప్పటి ఘటనలో ఒక జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)