Breaking News

ట్రైన్‌లో పిడకలతో చలి మంట.. తర్వాత ఏం జరిగిందంటే..

Published on Sat, 01/06/2024 - 20:19

కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్‌మ్యాన్‌ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్‌ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ  ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు  ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్‌లో గేట్‌మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు. 

వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్‌పీఎఫ్‌ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్‌ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు. 

రైలు అలీఘర్ జంక్షన్‌ చేరిన తరువాత జనరల్‌ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్‌కు చెందిన చందన్(23),  దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు.
చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్‌ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)