Breaking News

వేడి వేడి కిచిడీ పడి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు..

Published on Sat, 11/02/2024 - 18:10

ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురలోని ఆశ్రమం వద్ద ప్రసాదం కోసం క్యూలో వేచి ఉన్నఇద్దరు మహిళా భక్తులపై 'కిచిడీ' వడ్డించే వ్యక్తి జారిపడి వేడి ఆహారం వారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్యూలో నిలబడిన మరో ఎనిమిది మంది మహిళలకు కూడా పాత్రలోని వేడి వేడి కిచిడీ పడటంతో స్వల్ప గాయపడ్డారు. గాయపడిన భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ఆగ్రాలోని ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా ఇద్దరు భక్తులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు.

మధురలోని బృందావన్ ప్రాంతంలోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం భక్తులందరూ  పరిక్రమ మార్గ్ సంత్ కాలనీలో ఉన్న గౌరీ గోపాల్ ఆశ్రమానికి చేరుకోగా.. బయట ప్రసాదం పంపిణీ చేస్తుండటాన్ని గమనించారు. 

బియ్యం, పప్పుతో చేసిన కిచిడీని తీసుకునేందుకు భక్తులు క్యూలో నిల్చున్నారు. ఈక్రమంలో కిచిడీని పాత్రను తీసుకొస్తున్న వ్యక్తి జారిపడిపోయాడు. అతని చేతిలోని వేడి ఆహారం పక్కన నిలబడి ఉన్న మహిళలపై పడినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వందనా అగర్వాల్‌ చెప్పారు. ఈ సంఘటన భక్తులను భయాందోళనకు గురిచేసిందని, గాయపడిన 10 మంది మహిళలను ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)