Breaking News

ఒడిశా విద్యార్థి ఆత్మహత్య కేసులో ఏబీవీపీ నేత సహా ఇద్దరు అరెస్టు 

Published on Tue, 08/05/2025 - 06:27

భువనేశ్వర్‌: బాలాసోర్‌లో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి­తో సహా ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని నిప్పంటించుకున్నప్పుడు ఏబీవీపీ నాయకుడు సుభత్‌ సందీప్‌ నాయక్, జ్యోతి ప్రకాష్‌ బిస్వాల్‌ అక్కడే ఉన్నా­రని అధికారులు సోమవారం తెలిపారు. 

తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కళాశా­ల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) స­మా­వేశంలో విద్యార్థినిపై ఒత్తిడి చేశారు. అంతేకాదు.. యువతిపైనే చర్యలు తీసుకోవాలంటూ కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి నిందితుడు సాహూ విద్యార్థుల బృందాన్ని సమీకరించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీ సాహూను గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. వారిని బాధ్యతల నుంచి సస్పెండ్‌ చేశారు. అనంతరం ఆత్మ­హ­త్య చేసుకునే పరిస్థితులకు పురికొలి్పన ఇద్దరు ఏబీవీపీ నేతలను ఇటీవల అరెస్టు చేశారు.  

బాలాసోర్‌లోని ఫకీర్‌ మోహన్‌ అటా­నమస్‌ కాలేజీలో ఇంటిగ్రేటెడ్‌ బి.ఎడ్‌ చదువుతున్న 20 ఏళ్ల యువతి.. డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సమీర్‌ కుమార్‌ సాహూ తనను లైంగికంగా వేధిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, అది పెద్దగా పురోగతి సాధించలేదు. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసిన ఆమె.. కొద్దిసేపటికే క్యాంపస్‌లోనే నిప్పంటించుకుంది.

 ఆమె­ను మొదట బాలాసోర్‌ జిల్లా ఆసుపత్రిలో చేర్చి, తరువాత ఎయిమ్స్‌ భువనేశ్వర్‌కు తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె ప్రాణాలతో పోరాడింది. పరిస్థితి విషమించడంతో జూలై 14న మరణించింది. వేధింపుల కారణంగా యువతి బాధపడుతోందని తోటి విద్యార్థులు తెలిపారు. సాహూ అనుచిత డిమాండ్లు చేసేవాడని, అంగీకరించకపోతే ఫెయిల్‌ చేస్తానని బెదిరించేవాడన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)