Breaking News

అస్సాంలో కలకలం..19 చోట్ల బాంబులు అమర్చిన ఉల్ఫా

Published on Thu, 08/15/2024 - 13:57

అస్సాంలో రాష్ట్ర సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ఉల్ఫా) కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు 19 బాంబులు అమర్చినట్లు గురువారం ప్రకటించింది.  

ఎగువ అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపింది. ఆ ప్రకటన చేసిన కొద్ది సేపటికే శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో తమ ఉనికిని  చాటుకుంటామని తెలిపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆపరేషన్‌ను విరమించుకుంది.  

పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని వెలికితీసి నిర్విర్యం చేయాలని అభ్యర్థించింది. బాంబులు ఎక్కడెక్కడ అమర్చిందో వాటి ప్రాంతాల్ని సైతం వెల్లడించింది.

కానీ టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పింది. కానీ కచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించలేకపోయింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)