Breaking News

Karnataka : అసెంబ్లీలో గందరగోళం.. 18 మంది ఎమ్మెల్యేలపై వేటు

Published on Fri, 03/21/2025 - 16:47

బెంగళూరు: హనీ ట్రాప్‌ (honey trap) దుమారంతో కర్ణాటక (Karnataka) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.  హనీట్రాప్‌ అంశంపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన 18 మంది బీజేపీ (bjp) ఎమ్మెల్యేలపై స్పీకర్‌ యుటి ఖాదర్‌ సస్పెన్షన్‌ వేశారు.  

కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో  ప్రభుత్వం తీర్మానించింది. అయితే, ఆ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హనీట్రాప్‌పై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హనీట్రాప్‌ను డైవర్ట్‌ చేసేందుకు ముస్లిం రిజర్వేజన్‌ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారని ఆరోపణలు గుప్పించారు  

అంతేకాదు, హనీట్రాప్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పేపర్లను చించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్‌ ముఖంపై విసిరేశారు. అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేపర్లు చించి బీజేపీ ఎమ్మెల్యేలపై విసరడంతో గందరగోళం నెలకొంది.

 దీంతో అసెంబ్లీ స్పీకర్‌ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను  బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. సభ నుంచి 18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆరు నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)