బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్‌, పరారీలో ఎస్‌ఐ

Published on Thu, 01/08/2026 - 15:01

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో దారుణ ఘటన  కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.

బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్‌లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం  చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్‌ అరెస్ట్‌ చేశారు. సబ్-ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య  పరారీలో ఉన్నాడు.

ఏం జరిగిందంటే..
7వ తరగతి చదువు మానేసిన  మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో  ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి  పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.

నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు.  జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్‌ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు  చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.
పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో  పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు.

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)